వామ్మో: "కేజిఎఫ్ 2" ఎడిటర్ చిన్న కుర్రాడా?

VAMSI
కెజీఎఫ్ 2 సినిమా కోసం అటు హీరో యశ్ అభిమానులు మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అభిమానులు గత మూడు సంవత్సరాల నుండి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే నిన్న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్ లతో మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మొదటి పార్ట్ లో ఏ అంశాలను అయితే ప్రధానంగా చేసుకుని స్క్రీన్ ప్లే రాసుకున్నాడో, పార్టీ 2 లో సైతం కొన్ని అంశాలను హైలైట్ చేసుకుంటూ కథను నడిపించాడు. ఈ సినిమా పట్ల రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా యశ్ నటన, యాక్షన్ సీన్స్, అమ్మ సెంటిమెంట్ మరియు క్లైమాక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇదే ఊపు కొనసాగిస్తే వారం తిరిగే లోపు అన్ని రికార్డులు తిరగరాస్తుంది. గత కొద్ది రోజుల నుండి ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాలో ఒక విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ ను షాక్ కు గురి చేస్తోంది. ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేసింది ఎవరో ఒక సీనియర్ పర్సన్ అని అంతా అనుకునేలా ఇందులో సీన్స్ ఉన్నాయి.  ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ అదే అనుభూతికి లోనవుతారు. కానీ వాస్తవం ఏమిటంటే ఈ సినిమాకు ఎడిటర్ గా చేసిన వ్యక్తి కేవలం 19 సంవత్సరాల యువకుడు అని తెలుస్తోంది.

అయితే మొదట ఈ విషయం ఎవరికీ నమ్మేలా లేదు. కానీ ఇదే నిజం... ఇతని పేరు ఉజ్వల్ కులకర్ణి, మామూలుగా ఈ కాలంలో కుర్రాళ్ళు సోషల్ మీడియాకు ఎంత ఆకర్షితులు అవుతున్నారో తెలిసిందే, అలాగే ఉజ్వల్ కూడా యూట్యూబ్ వీడియోలు మరియు ఫ్యాన్ మేడ్ వీడియోలను ఎడిట్ చేస్తూ ఉండేవాడు. అయితే ఇతని వీడియోలు పరిశీలించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పార్ట్ 2 కి ఇతనిని ఎడిటర్ గా నియమించాడు. అయితే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా హాలీవుడ్ స్థాయిలో సీన్స్ ను కట్ చేసి తన పనితీరును చూపించాడు ఉజ్వల్. ఇప్పుడు సర్వత్రా ఇతని ఎడిటింగ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఇతను చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: