కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో తెలుగు హీరోయిన్..
విషయాన్నికొస్తే.. తెలుగు యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు..తెలుగులో 'మల్లీశం' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన అనన్య..ఈ సినిమా తర్వాత ప్లేబ్యాక్', 'వకీల్ సాబ్', 'మాస్ట్రో' వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్లో రూపొందుతున్న సమంత హీరోయిన్ గా నటిస్తున్న 'శాకుంతలం' చిత్రం లో కీలక పాత్రను పోషించింది.. ఆ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా వుంది.
ఇది ఇలా ఉండగా.. తమిళ హీరో శశికుమార్ నటించే చిత్రం ద్వారా అనన్య తమిళ పరిశ్రమకు పరిచయమవుతోంది.. అంజల్ ఫెమ్ తంగం పా.శరవణన్ దర్శకుడు. ఎస్‌కేఎల్‌ఎస్ గెలాక్సీ మాల్ ప్రొడక్షన్స్ బ్యానరు లో ఈ. మోహన్ సినిమాను నిర్మిస్తున్నారు..ఈ చిత్రానికి శ్యాస్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు.. శశికుమార్ సరసన అనన్య నటిస్తుండగా.. కరుణాస్, రమ్య నంబీశన్, విఘ్నేష్, 'బాహుబలి' ప్రభాకర్ మొదలైన వాళ్ళు సినిమా లో కీలక పాత్రలో నటిస్తూన్నారు. దక్షిణ భారత దేశ వ్యాప్తంగా ప్రయాణించే ఓ ట్రావెల్ కథ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా అనన్య కు మంచి ఫెమ్ ను అందుకుంటుందో లేదో చూడాలి..