ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఆ హీరో మళ్ళీ కనిపించాడబ్బా?
ఇక ఆ తర్వాత జానకి వెడ్స్ శ్రీరామ్, నేను మా సీతామహాలక్ష్మి అంటూ ఎన్నో సినిమాల్లో నటించిన హీరో రోహిత్ కి మాత్రం మంచి బ్రేక్ రాలేదు అని చెప్పాలి. మొదట హీరోగా నటించిన రోహిత్ ఆ తర్వాత మాత్రం స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమయ్యాడూ. చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎం బి బి ఎస్ అనే సినిమాలో క్యాన్సర్ తో బాధపడుతున్న పేషెంట్ పాత్రలో నటిస్తాడు రోహిత్. అయితే ఇక ఆ తర్వాత కాలంలో అవకాశాలు లేకపోవడంతో చిత్ర పరిశ్రమలో పూర్తిగా కనుమరుగై పోయాడు.
ఈ హీరో మళ్లీ సినిమా ఇండస్ట్రీలో కి రీ ఎంట్రీ ఇస్తే బాగుండు అని రోహిత్ అభిమానులందరూ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే చాలా రోజులు కాదు కాదు చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఒక బుల్లితెర కార్యక్రమంలో ప్రత్యక్షమై పోయాడు.. ఏకంగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై ఈ చిత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రోమో లో భాగంగా ఇంద్రజ తో పాటు మరో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు హీరో రోహిత్. ఇక తనదైన శైలిలో అలరిస్తాడూ. ఇక ఎన్నో ఏళ్ల తర్వాత రోహిత్ ని చూసిన అభిమానులు మురిసిపోతున్నారు..