'రావణాసుర' సినిమా మేజర్ షెడ్యూల్ ను పూర్తి చేసిన రవితేజ..!

Pulgam Srinivas
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ స్పీడ్ మామూలుగా లేదు, ఒక సినిమా సెట్స్ పై ఉండగానే రవితేజ మరో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళుతూ ఫుల్ స్పీడ్ ను చూపిస్తున్నాడు.  గత కొంత కాలంగా  వరస పరాజయాలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయిన రవితేజ 'క్రాక్'  సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు,  మళ్లీ ఖిలాడి సినిమాతో రవితేజ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ ను ఎదుర్కొన్నాడు.  ఇలా ఖిలాడి మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ ను ఎదుర్కొన్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రావణాసుర సినిమాలో నటిస్తున్నాడు,  అందులో భాగంగా రవితేజ ఇప్పటికే రావణాసుర సినిమా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.  


అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీ కి  రవితేజ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు,  సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చాలా శర  వేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది.  కొన్ని రోజులుగా మేజర్ షెడ్యూల్ రావణాసుర చిత్ర బృందం మేజర్ షెడ్యూల్ షూటింగ్ ను చేస్తూ వెళుతున్నారు,  తాజాగా ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్టుగా అధికారికంగా రావణాసుర చిత్ర బృందం తెలియజేసింది. ఈ షెడ్యూల్లో రావణాసుర చిత్ర బృందం  కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ,  యాక్షన్ సన్నివేశాలను ను కూడా పూర్తి చేసినట్టుగా చెబుతున్నారు,  ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ సరసన  అనూ ఇమ్మాన్యుయేల్ , మేఘ ఆకాశ్ ,  ఫరియా అబ్దుల్లా ,  దక్షా నగర్కార్ ,  పూజిత పొన్నాడ హీరోయిన్ లుగా అలరించనున్నారు, రావణాసుర మూవీ లో సుశాంత్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజ ఈ సినిమా తో పాటు ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా , టైగర్ నాగేశ్వరరావు సినిమాలలో కూడా నటిస్తున్నాడు, అలాగే రవితేజ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కబోయే సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: