ఆచార్య ట్రైలర్ రన్ టైమ్ అంతనా?

Satvika
సైరా నరసింహరెడ్డి సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా ఆచార్య.. ఈ సినిమా లో మెగాస్టార్ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా కనిపించనున్నాడు.ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అన్నీటిని చూస్తె ఆ విషయం అందరికి అర్థమవుతోంది.. అవినీతిని అరికట్టే పాత్రలో దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి పాత్రలో కనిపిస్తారు.. యాక్షన్, మాస్, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సినిమా రానుంది. ఈ సినిమా చిరంజీవికి ఎ మాత్రం తగ్గకుండా కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. గతంలో ఈ సినిమా నుంచి విడుదల అయిన అన్నీ కూడా సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.


అయితే తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఇవాళ సాయంత్రం 5.09 గంటలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఆ ట్రైలర్ లో చిరు ఎంట్రీ నుంచి మొత్తం సినీ ప్రెక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది..ఎటు చూసిన ట్రైలర్ సినిమాపై మెగా అభిమానులకు భారీ అంచనాలు ఎర్పడేలా చెస్తుంది. విడుదల చేసిన కొద్ది గంటల లోనే సోషల్ మీడియాలో ట్రైలర్ ట్రెండ్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 152 థియేటర్లలో నేరుగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే..


ఇప్పటివరకు ఎంత పెద్ద సినిమాకు లేని విధంగా ట్రైలర్ టైం ఈ చిత్రానికి ఉండటం విశేషం.ట్రైలర్ కట్ చాలా బాగా వచ్చిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. చాలా రోజుల తరువాత మెగాస్టార్ నుండి పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూడబోతున్నట్లు ఆచార్య టీమ్ అభిప్రాయ పడుతున్నారు.చిరు ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. తండ్రి కొడుకుల మధ్య వస్తున్న సన్నీవేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయని చిత్రయూనిట్ వెల్లడించారు..కాజల్ చిరుకు జోడిగా నటించగా, పూజాహెగ్డే రామ్ చరణ్ కు జోడిగా నటిస్తుంది.ఈ సినిమాను ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ అంతా సిద్దం చెస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: