ఇండస్ట్రీ రికార్డుల గురించి హీరో యష్ ఏమన్నారంటే..?

Divya
ప్రస్తుతం యువత ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రం కే జి ఎఫ్ -2 అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఎంతోమంది చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ రానే వచ్చేసింది. ఈ చిత్రం గురువారం రోజున ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు చిత్రబృందం , అభిమానులు కూడా. ఇక ఈ సినిమా మొదటి భాగం ఎవరూ ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా ఈ సినిమా సీక్వెల్ పై మరింత అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మొత్తం గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది.


ఇక కే జి ఎఫ్-2 చిత్రం విడుదల తేది దగ్గర పడుతుండటంతో హీరో ,దర్శక ,నిర్మాతలు సైతం బాగా సందడి చేయడం జరుగుతోంది. ఇక ఇలాంటి వాటి లోనే భాగంగా తాజాగా గత ఆదివారం చిత్ర బృందం మొత్తం తిరుపతి లో సందడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక మీడియా సమావేశంలో హీరో యశ్ ఈ చిత్రం గురించి మాట్లాడడం కూడా జరిగింది. తిరుపతికి వచ్చి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని.. కేవలం ఇక్కడికి స్వామి వారి ఆశీస్సులను పొందడానికి వచ్చానని తెలియజేశారు.


అంతే కాకుండా కర్ణాటక - ఆంధ్ర మధ్య చాలా అనుబంధం ఉన్నది.. కన్నడ వాళ్లు తెలుగు కూడా చదవగలరని .. తమని ఇంతలా ఆదరిస్తారని ఎవరూ ఊహించలేదు అని అంటూ ఆడియెన్స్ కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది యశ్. ఇక వీటితో పాటు గా బాహుబలి -2, కే జి ఎఫ్-2  లలో ఎది రికార్డులను సైతం తిరగరాస్తుంది అని ఒక మీడియా సంస్థ  అడగగా .. అందుకే హీరో యశ్ మాట్లాడుతూ.. అలా చేస్తే చాలా మంచిదే కదా . ఒక సినిమా క్రియేట్ చేసిన రికార్డులను సైతం తర్వాత సినిమా బ్రేక్ చేయాలి.. ఇలా నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. అంటూ బదులిచ్చారు ఇక బాహుబలి వర్సెస్ కే జి ఎఫ్ సినిమా పై ఎలా స్పందిస్తారు అని అడిగా.. అందరికీ విజయమే రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: