ఫుల్ స్పీడ్ మీద ఉన్న డైరెక్టర్ తేజ..!

Pulgam Srinivas
దర్శకుడు తేజ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  దర్శకుడు తేజ కొన్ని సంవత్సరాల క్రితం తక్కువ బడ్జెట్ తో చిత్రాలను తెరకెక్కించే ఎక్కువ లాభాలను నిర్మతలకు తీసుకువచ్చిన దర్శకులలో దర్శకుడు తేజ ఒకరు.  తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం,  జయం ,నువ్వు నేను సినిమాలు మంచి విజయాలను సాధించాయి,   ప్రేమ కథా చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు తేజ. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న తేజ గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు,  బాక్సాఫీస్ దగ్గర వరుస పరాజయాలతో ఉన్న సమయంలో తేజ 'నేనే రాజు నేనే మంత్రి'  సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.


 ఈ సినిమాలో దగ్గుబాటి రానా హీరోగా నటించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది,  నేనే రాజు నేనే మంత్రి సినిమా తో ఫామ్ లోకి వచ్చిన దర్శకుడు తేజ ఆ తర్వాత బెల్లంకొండ  శ్రీనివాస్ హీరో గా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన సీత  సినిమా తో మరో సారి బాక్సాఫీసు దగ్గర పరాజయాన్ని ఎదుర్కొన్నడు.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు తేజ , అభి రామ్ హీరో గా అహింస అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు,  ఇది ఇలా ఉంటే దర్శకుడు తేజ బాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్ లకు  సైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది,  బాలీవుడ్ లో దర్శకుడు తేజ  ఒక సినిమా కు మరియు అలాగే ఒక వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.  త్వరలోనే ఈ  ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, ఇలా దర్శకుడు తేజ ఫుల్ స్పీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: