ఆ స్టార్ డైరెక్టర్ నన్ను గర్భవతిని చేశాడు : నటి
ఇక అప్పట్లో మీ టు ఉద్యమం పేరుతో అన్ని ఇండస్ట్రీల్లో ఇలా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొనేవారు బయటికి రావడం సంచలనం మారిపోయింది. మీ టూ ఉద్యమం కారణంగా ఎవరైనా నటీమణుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవలె బాలీవుడ్ నటి మోడల్ షాకింగ్ విషయాన్ని బయట పెట్టి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఒక డైరెక్టర్ నన్ను ప్రేమించి నమ్మించి గర్భవతిని చేసి చివరికి మోసం చేసాడు అంటు షాకింగ్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పింది. ఆ బాలీవుడ్ నటి ఎవరో కాదు మందనా కరిమి.
ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించి నటనతో మెప్పించినా మందనా కరిమి.. ఇక మోడల్ గా కూడా ఎంతగానో గుర్తింపు కూడా సంపాదించుకుంది. ఇకపోతే ఇటీవలే షాకింగ్ విషయాన్ని చెప్పింది. తన భర్త తో విడిపోయిన తర్వాత ఒక ప్రముఖ డైరెక్టర్ తో సీక్రెట్ రిలేషన్ షిప్ కొనసాగించాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తర్వాత శారీరక వాంఛలు తీసుకొని గర్భవతిని చేసి మోసం చేశాడు అంటూ సదరు నటి తెలిపింది. కంగనా రనౌత్ హోస్టింగ్ చేస్తున్న లాకప్ అనే షోలో అతిథిగా వెళ్లిన మందనా కరిమి.. ఈ విషయాలను వెల్లడించింది.ఇక ఈ విషయం తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లానని ఇక ఆ సమయంలో స్నేహితులు ఎంతగానో ఓదార్చారు అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు అన్నది మాత్రం బయటపెట్టలేదు.