సుధీర్.. ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడో తెలుసా?
అయితే సుడిగాలి సుదీర్ కు అంతటి పాపులారిటీ సంపాదించడానికి రష్మి గౌతమ్ తో లవ్ ట్రాక్ కూడా కారణం అని చెప్పాలి. జబర్దస్త్ లో వీరి లవ్ ట్రాక్ నచ్చని ప్రేక్షకులు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇద్దరు ఒకచోట కనిపించారంటే చాలు తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా చూసి మురిసిపోతూ ఉంటారు. వీరిద్దరికీ పెళ్లి జరిగితే చూడాలని ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తమ మధ్య ఉంది కేవలం స్నేహం మాత్రమే అని చెబుతున్నారు ఇద్దరు. అయితే గతంలో శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఒక అమ్మాయి తో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు చూపించడం తో అందరూ షాక్ అయ్యారు.
అదేంటి రష్మీ సుధీర్ పెళ్లి చేసుకోవడం లేదా సుధీర్ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరు సోషల్ మీడియాలో తెగ చర్చించుకున్నారు. అయితే సుధీర్ స్నేహితులైన రాంప్రసాద్ గెటప్ శ్రీను లకు పెళ్లిళ్లు అయిపోయాయి.. అందరూ కూడా ప్రస్తుతం సుధీర్ పెళ్లి గురించి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో భాగంగా పెళ్లి గురించి అందరూ అడుగుతూ ఉంటే.. ఇక అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇక పెళ్లి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఇంతకీ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అంటే అని చెబుతూ కాసేపు సిగ్గుపడతాడూ సుధీర్. తర్వాత ఇక అమ్మాయిని స్టేజ్ మీదకి తీసుకురావడానికి కిందికి వెళ్తాడు. కానీ అమ్మాయి ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఇక సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అని తెలుసుకోవడానికి బుల్లితెర ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు..