ప్రస్తుతం 'ఓ టి టి' ల క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది, అలా 'ఓ టి టి' ల క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ప్రేక్షకులు కూడా 'ఓ టి టి' లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉండడంతో రోజు రోజుకు 'ఓ టి టి' ల క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది, ఇలా 'ఓ టి టి' లకు క్రేజ్ పెరుగుతూ వస్తుండటంతో 'ఓ టి టి' సంస్థలు కూడా పోటీపడుతూ మంచి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు, అలాగే కొన్ని సినిమాలు థియేటర్ లలో కాకుండా నేరుగా 'ఓ టి టి' లో విడుదల అవుతూ ఉండడంతో ప్రేక్షకులను మరింతగా 'ఓ టి టి' లపై ఆసక్తి చూపుతున్నారు, ఇది ఇలా ఉంటే కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదలైన అప్పటికీ అతి తక్కువ కాలంలోనే 'ఓ టి టి' లోకి వచ్చేస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే శర్వానంద్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఏప్రిల్ 14 వ తేదీ నుండి ప్రముఖ ఒక 'ఓ టి టి' సోనీ లివ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల కాకముందు ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.90 కోట్లు బిజినెస్ జరిగింది, అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.60 కోట్లు వ్యాపారం జరిగింది, ప్రపంచ వ్యాప్తంగా ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ కి రూ. 15.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీ గ్రాండ్ గా విడుదలైంది, కానీ ఈ మూవీ కి ప్రేక్షకుల నుంచి దీనికి అంతగా స్పందన రాలేదు, ఫలితంగా ఫుల్ రన్‌లో రూ. 7.80 కోట్లు షేర్ తో పాటు రూ. 10.75 కోట్ల గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది, దీంతో ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ కి రూ. 8.20 కోట్లు నష్టాలు వచ్చాయి, ఇలా థియేటర్ లలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిన ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థ సోనీ లివ్ లో ఏప్రిల్ 14 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.