ఆలియా - రణబీర్ పెళ్లి.. అసలు తేదీ ఇదేనా?
ఎన్నో రోజుల పాటు ప్రేమలో మునిగితేలిన ఆలియా భట్ రణబీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త ఎన్నో నెలలా నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంది. అయితే ఈ పెళ్ళి విషయం గురించి ఇప్పటి వరకు ఈ ఇద్దరూ బహిరంగంగా స్పందించింది లేదు. అంతేకాదు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ప్రస్తుతం కెరీర్ పైనే తన దృష్టి ఉంది అంటూ మీడియా ముందు కూడా సమాధానం చెప్పింది ఈ బాలీవుడ్ జంట. కానీ ఇప్పుడు మాత్రం ఇక పెళ్లికి రెడీ అయిపోయింది అన్నది తెలుస్తుంది. ఇక మరి కొన్ని రోజుల్లో వీరి ప్రేమ వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుందట.
ఈనెల 14వ తేదీన రణబీర్ కపూర్ ఆలియాభట్ వివాహం జరగబోతుంది అనేది తెలుస్తుంది. ఆలియా భట్ అంకుల్ రాబిన్ బట్ ఈ విషయాన్ని చెప్పినట్లు ఇండియా టుడే ఒక కథనాన్ని ప్రచురితం చేసింది. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరి పెళ్లికి రెండు మూడు తేదీలు ప్రచారంలో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 17వ తేదీన పెళ్లి ముహూర్తం అంటూ కొన్ని రోజులపాటు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇటీవలే ఆలియా భట్ అంకుల్ చెప్పిన దాని ప్రకారం.. మాత్రం ఈనెల 14వ తేదీన పెళ్లి ముహూర్తం ఉందని 13వ తేదీన జరగబోతుంది క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది..