శ్రీలీల డిమాండ్స్ కు షాక్ అయిన నితిన్ !

Seetha Sailaja

ఈమధ్య హీరోయిన్ రాధిక ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తాను టాప్ హీరోయిన్ గా కొనసాగే రోజులలో తనకు ఎన్ని హిట్స్ వచ్చినప్పటికీ అప్పట్లో తనకు రెండు మూడు లక్షలు ఇవ్వడానికి కూడ నిర్మాతలు బాధ పడేవారని అప్పటి విషయాలను ఆ ఇంటర్వ్యూలో గుర్తుకు చేసుకుంది. అంతేకాదు ఇప్పటి హీరోయిన్స్ లో చాలామంది గ్లామర్ కు పనికి వస్తున్నారు కానీ బరువైన పాత్రలకు పనికిరారు అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.



ఈ పరిస్థితుల మధ్య యంగ్ హీరోయిన్ శ్రీలీల పెంచిన పారితోషిక డిమాండ్స్ కు సంబంధించిన వార్తలు వింటుంటే నటి రాధిక చెప్పిన మాటలు నిజమే అని పిస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం శ్రీలీల నితిన్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయింది. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.




ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర చాల గ్లామర్ గా కనిపించవలసిన పరిస్థితులలో శ్రీలీల వద్దకు వెళ్ళినప్పుడు ఆమె నితిన్ పక్కన నటించడానికి కోటిన్నర డిమాండ్ చేసిందట. దీనితో షాక్ అయిన ఆ మూవీ నిర్మాతలు ఆమెతో అనేకసార్లు బేరసారాలు ఆడిన తరువాత చివరకు 1.25 కోట్లు పారితోషికానికి అంగీకరించిందట. అంతేకాదు కర్ణాటక మాజీ మంత్రి ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్ధనరెడ్డి కిరీటి తొలిసారి హీరోగా పరిచయం అవుతున్న మొట్టమొదటి సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు శ్రీలీల 2 కోట్లు డిమాండ్ చేసినట్లు కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి.



వాస్తవానికి శ్రీలీల నటించిన ఒకేఒక్క సినిమా ‘పెళ్ళి సందD’ మాత్రమే విడుదల అయింది. ఆమూవీ చెప్పుకోతగ్గ స్థాయిలో విజయవంతం కానప్పటికీ శ్రీలీల కు ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించబోయే మూవీలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయింది అని వస్తున్న వార్తలను చూసి ఈమెకు ఈస్థాయిలో ఎందుకు క్రేజ్ ఏర్పడింది అనుకుంటూ ఇండస్ట్రీ షాక్ అవుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: