ఆ రకంగా 'రాధే శ్యామ్' మూవీ కి కు కొంత ఊరట లభించిందట..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి'  సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజీ హీరో గా మారిన విషయం మన అందరికీ తెలిసిందే,  బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్  'సాహో'  సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు,  ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నిరాశ పరిచినప్పటికీ బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రం బాగానే అలరించింది.  అలా సాహో సినిమాతో  పర్వాలేదు అని రిజల్ట్ ను అందుకున్న ప్రభాస్, సాహో సినిమా తర్వాత రాధే శ్యామ్ మూవీ తో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు,  ఇటలీ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది,  ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా,  ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు.


 ఇది ఇలా ఉంటే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు,  ఇది ఇలా ఉంటే రాధే శ్యామ్  సినిమాకు భారీ మొత్తంలో నష్టాలు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం ప్రభాస్ తన పారితోషికాన్ని కూడా వదులుకున్నట్టు ఒక ప్రచారం నడుస్తోంది,  ఇది ఇలా ఉంటే రాధే శ్యామ్ సినిమా నెల రోజుల లోపే అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లోకి వచ్చేసింది.  దీనితో ఈ సినిమాను థియేటర్ లలో చూడలేని వారంతా ఇప్పుడు 'ఓ టి టి'  లో చూస్తున్నారు,  రాధే శ్యామ్  మూవీ థియేట్రికల్ హక్కుల వలన నష్టపోయిన నిర్మాతలకు, డిజిటల్ హక్కుల వలన భారీ ఆదాయం చేకూరింది,  ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మరి కొంత కాలం తరువాత ఈ మూవీ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కావాలి.  కానీ ముందుగానే ఈ మూవీ 'ఓ టి టి'  లో స్ట్రీమింగ్ చేయడం కోసం అమెజాన్ ప్రైమ్ వారు అదనంగా మరో 25 కోట్లను చెల్లించారట,  ఈ రకంగా రాధే శ్యామ్ సినిమాకు కొంత ఊరట కలిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: