మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వం లో మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది, ఇది ఇలా ఉంటే తాజాగా గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, గాడ్ ఫాదర్ సినిమా ను ఆగస్టు నెలలో విడుదల చేయాలనే ఉద్దేశంలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, అందులో భాగంగా ఆగస్టు నెలలో గాడ్ ఫాదర్ మూవీ ని విడుదల చేయాలి అనే ఉద్దేశం తో చిత్ర బృందం షూటింగ్ ని శర వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే చిరంజీవి ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేశాడు , ఆచార్య సినిమా ఈ నెల 29 వ తేదీన విడుదల కాబోతుంది, ఆచార్య సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేసే ప్లాన్ లో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా లతో పాటు తమిళ సూపర్ హిట్ మూవీ వేదళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి కె ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు , మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు.