మెగాస్టార్ స్టేట్ రౌడీ సినిమాను.. ఈనాడు బ్యాన్ చేసిందా.. ఎందుకు?
యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న దర్శకుడు బి.గోపాల్ సినిమాను తెరకెక్కించారు. స్టార్ ప్రొడ్యూసర్ కోదండరామి రెడ్డి సినిమా నిర్మించారు. అయితే చిరంజీవి కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన స్టేట్ రౌడీ సినిమా అప్పట్లో ఈనాడు పత్రిక బ్యాన్ చేసింది అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇలా బ్యాన్ చేయడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కూడా ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
దీంతో అప్పట్లో మీడియాలో ఎక్కడ చూసిన కూడా స్టేట్ రౌడీ ప్రారంభోత్సవం గురించి రాశారు. ఈనాడు కూ చెందిన సితార ఎడిషన్ లో మాత్రం ఒకే ఒక పేజీలో ఈ ప్రారంభోత్సవం గురించి రాసి వదిలేసారు. అయితే స్టేట్ రౌడీ సినిమా షూటింగ్ సారధి స్టూడియోస్ లో జరుగుతుంది. అదే సమయంలో అటు ఈనాడు చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తున్న వినాయకరావు ఫోటోగ్రాఫర్ కుమార స్వామితో కలిసి షూటింగ్ స్పాట్ కు వెళ్లారు. ఆ సమయంలో స్టేట్ రౌడి నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న శశిభూషణ్ ఇక ప్రారంభోత్సవం గురించి ఒక పేజీలో రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారట. శశిభూషణ్ అంతేకాదు ఒక రకంగా బయటికి వెళ్ళండి అంటూ గెంటేసినంత పని చేశారట. దీంతో ఎంతో అవమానంగా ఫీల్ అయిన వినాయకరావు ఈ విషయాన్ని రామోజీరావు దృష్టికి తీసుకెళ్లారట.
నీకు జరిగితే నాకు కూడా అవమానం జరిగినట్లే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రామోజీరావు ఈనాడు పత్రిక లో ఎక్కడెక్కడ స్టేట్ రౌడీ వార్తలు కనిపించకూడదు అని ఆ సినిమాపై బ్యాన్ విధించారట. అసలు సారధి స్టూడియోలో ఉషా కిరణ్ మూవీస్ తెరకెక్కించే ఏ సినిమా షూటింగ్ కూడా జరిగేందుకు వీలు లేదు అని కండిషన్ కూడా పెట్టారట. దీంతో నిర్మాత సుబ్బిరామిరెడ్డి విషయం తెలుసుకుని స్వయంగా రామోజీ రావును బుజ్జగించిన ఆయన వెనక్కి తగ్గలేదు. చివరికి సినీ పెద్దలు కలిపించకపోవడంతో రామోజీరావు స్టేట్ రౌడీ సినిమా పై ఉన్న బ్యాన్ ఎత్తివేయడంతో ఇక సీతారాలో స్టేట్ రౌడి వార్తలు వచ్చాయట..