కొత్త మూవీ అప్డేట్ తో వచ్చిన కిరణ్ అబ్బవరం..!!
అయితే ప్రస్తుతం హీరో కిరణ్ అబ్బవరం తో సినిమా రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. కిరణ్ అబ్బవరం చివరిగా సెబాస్టియన్ అనే మూవీ తో ప్రేక్షకులకు బాగా అలరించారు. ఇక ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కిరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. చిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి గా దూసుకుపోతున్నారు కిరణ్ అబ్బవరం. అయితే ప్రస్తుతం నటిస్తున్న గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మరిన్ని ఆశలు పెట్టుకొన్నారు కిరణ్. ఈ బ్యానర్ పై వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మురళి కిషోర్ డైరెక్షన్లో రూపొందిస్తున్నారు.
ఇక కిరణ్ అబ్బవరం కు జోడీగా కాశ్మీర పరదేశి నటిస్తున్నది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి సంబంధించినట్లయితే వారికి కొన్ని సన్నివేశాలను తిరుపతిలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు గా యాక్షన్ సన్నివేశాల్ని ఒక పాటను కూడా చిత్రీకరించారు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ చిత్ర దర్శకుడు ఇదివరకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.