టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు హీరోలు మధ్య పోటీ ఏ స్థాయిలో ఉంది అంటే నువ్వా నేనా అన్నట్లుగా సినిమాలను ప్రకటన చేస్తున్నారు. ఒక
హీరో రెండు సినిమాలు చేస్తుంటే ఇంకొక
హీరో మూడు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అంతకుమించి ఇంకొంత మంది హీరోలు నాలుగైదు సినిమాలను కూడా లైన్లో పెడుతున్నారు. ఆ విధంగా
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో రెండు పైగా సినిమాలను చేసే హీరోలను ఆయా
సినిమా లను ఒకసారి గమనిద్దాం.
మెగాస్టార్
చిరంజీవి ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. ఇప్పటికే రెండు చిత్రాల షూటింగ్ లను సగానికిపైగా పూర్తిచేసిన ఈ
హీరో మరొక రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్ళడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. అలాగే
మాస్ రాజా
రవితేజ కూడా ఏకంగా ఐదు సినిమాలు ఒకేసారి చేస్తూ అందరినీ ఎంతగానో ఆశ్చర్య పరుస్తున్నాడు. రామారావు
సినిమా ను జూలై లో విడుదల చేస్తున్న ఈ
హీరో ఇప్పటికే ధమాకా మరియు రావణాసుర
సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆయన మరొక రెండు సినిమాలను చేసే విధంగా ముందుకు పోతున్నాడు.
తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే
సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెడుతున్నాడు. ఆ తర్వాత రౌడీ స్టార్
విజయ్ దేవరకొండ కూడా ఏకంగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు.
పూరి జగన్నాథ్ తో కలిసి ఆయన రెండు సినిమాలను చేస్తూ ఉండగా
శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ
సినిమా అలాగే
సుకుమార్ దర్శకత్వంలో ఓ
సినిమా చేస్తున్నాడు. ఆ విధంగా ఆయన మరో రెండేళ్ల దాకా ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నాడు. ఇక
ఎన్టీఆర్ ప్రభాస్ వంటి హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాల్లో షూటింగ్లో పాల్గొంటూ తమ దైన దూకుడును చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు వారికి ఎంత స్థాయి విజయాన్ని చేకూరుస్తుందో చూడాలి ఈవన్నే కూడా పాన్
ఇండియా సినిమాలే కావడం విశేషం.