మరొకసారి కేజీఎఫ్ చాప్టర్ వన్ రీ రిలీజ్ కి సిద్దం కానుందా..?

Divya
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. కన్నడ సూపర్ స్టార్ హీరో యష్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ సినిమా కే జి ఎఫ్ చాప్టర్ వన్. 1970 సంవత్సర మధ్యకాలంలో కోలార్ బంగారు గనుల్లో పనిచేసిన కార్మికుల జీవితాలు ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ప్రముఖ టాలీవుడ్ నటుడు కైకాల సత్యనారాయణ సమర్పణలో ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీగా 2018 డిసెంబర్ 20వ తేదీన దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం అంచనాలను లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

ఓవర్నైట్ లోని పాన్ ఇండియా హీరో గా చలామణి అయ్యారు యశ్. ఈ సినిమాతో శాండిల్వుడ్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. చాప్టర్ 1 కి సీక్వెల్ గా చాప్టర్ టు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ నెల 14 వ తేదీన ఈ సినిమా విడుదల చేస్తామని మేకర్ లు ప్రకటించారు.  ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో  సినిమా ప్రమోషన్స్ చేపట్టిన చిత్రం మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ పార్ట్ ను కూడా రీ రిలీజ్ కి  సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు ప్రమోషన్స్ లో  భాగంగా కొత్త ట్రెండ్ కి తెరలేపారు ఈ సినిమా చిత్రం మేకర్స్.

చాప్టర్ వన్ ఈ సినిమాను రిలీజ్ చేయడంలో కేవలం కన్నడ భాషలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషలలో కూడా రిలీజ్ చేయబోతున్నాం అని స్పష్టం చేశారు. అంతేకాదు చాప్టర్ 2 రావడానికి సరిగ్గా ఆరు రోజుల ముందు అనగా ఏప్రిల్ 8 వ తేదీన మొదటి దేశవ్యాప్తంగా నిర్దేశించిన ప్రాంతాలలోని థియేటర్లలో రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. సబ్సిడీ ధరలకే మొదటి చాప్టర్ ను వీక్షించే అవకాశం కూడా ప్రేక్షకులకు కల్పిస్తామని అని సమాచారం ఇవ్వడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: