ఎన్టీఆర్, చరణ్ లను ఆ ఇద్దరు హీరోయిన్స్ తో పోల్చిన వర్మ.. ట్వీట్ వైరల్..!

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి.ఈయన తీసే ప్రతి సినిమా ఒక ప్రయోగమే.అయితే  ఇప్పుడే కాదు ఆయన ఎప్పుడు సినిమా చేసిన అందులో పర్ఫెక్షన్ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించిన ఈ విషయం అందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.ఇక్క్  దీంతో టీమ్ అంతా ఇన్ని రోజుల టెన్షన్ మరిచి హాయిగా రిలాక్స్ అయ్యారు.ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తే, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించిన విషయం తెలిసిందే. 

అయితే అందరు ఊహించిన విధంగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది.కాగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను జక్కన్న కలిపి ఒకేతాటి మీదకు తీసుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు.ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖులతో పాటు మిగతా ఇండస్ట్రీ వారు కూడా ఆయనపై ప్రశంసలు కురిపించారు.అయితే  రామ్ గోపాల్ వర్మ కూడా ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ గా స్పందించారు.అంతే కాదు తాజాగా వర్మ వదలకుండా మరొక ట్వీట్ చేసారు.ఇక ఈసారి మాత్రం ఆయన మార్క్ వర్డ్స్ వదిలాడు.అయితే ఆ యన ఇద్దరు హీరోయిన్ లతో ''మా ఇష్టం'' (డేంజరస్) అనే సినిమాతో రావడానికి సిద్ధం అయిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే ఈ క్రమంలోనే ఆయన ఒక ట్వీట్ చేసాడు..అయితే ఈయన  ''వెల్ సార్.. మీకు రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి డేంజరస్ బాయ్స్ ఉంటే.. ఇక నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు'' అని ట్వీట్ చేస్తూ ఫోటో కూడా షేర్ చేయడం జరిగింది .అయితే ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.అంతేకాకుండా ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజ్ కాబోతుంది.ఇకపోతే అన్ని భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను కొత్తగా ప్రొమోషన్స్ చేస్తూ వర్మ బిజీగా ఉన్నాడు...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: