శ్రీవల్లి తో షూటింగ్.. పుష్పకు జై కొట్టిన అమితాబ్?
ఇక ఇటీవలే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా.. ఇక ఇప్పటికీ పుష్ప మ్యానియా తగ్గలేదు అని ఇక అల్లు అర్జున్ అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో మెగాస్టార్ గా కొనసాగుతున్న అమితాబచ్చన్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. తన ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలని కాదు ఇక సినిమాలకు సంబంధించిన అప్డేట్ లను కూడా పోస్ట్ చేస్తూ అలరిస్తూ ఉంటారు. ఇక తాజాగా గుడ్ బై చిత్రంలో నటిస్తూ ఉన్నారు అమితాబచ్చన్. ఈ క్రమంలోనే షూటింగ్ సందర్భంగా జరిగిన ఒక ఫోటోని షేర్ చేశారు ఆయన. అయితే ఇలా అమితాబచ్చన్ షేర్ చేసిన ఫోటోకి పుష్ప అనే క్యాప్షన్ పెట్టడం గమనార్హం.
ఇక ఇందులో నేషనల్ క్రష్ రష్మిక క్యూట్ లుక్స్ లో కనిపిస్తోంది. రష్మిక తో పాటు నీవా గుప్త ఉన్నారు అయితే రష్మిక మందన గుడ్ బై సినిమాలో అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ అమితాబచ్చన్ పోస్టులో పుష్ప అనే సినిమా పేరు చూసిన తర్వాత పుష్ప మేనియా ఇంకా తగ్గలేదు అని అనుకుంటున్నారు అభిమానులు. ఇక రష్మిక మందన్న పుష్పా కాదు శ్రీవల్లి అని మరికొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన పోస్ట్ ఇచ్చిన ట్యాగ్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి..