హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ హాట్ బ్యూటీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ శాతం నందమూరి నటసింహం బాలకృష్ణ మూవీ లలో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. సోనాల్ చౌహాన్ , బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ , డిక్టేటర్ , రూలర్ మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది, ఈ మూవీ లతో పాటు అందాల ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ , రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన పండగ చేస్కో మూవీ లో హీరోయిన్ గా నటించింది, ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు.
ఇది ఇలా ఉంటే హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ది ఘోస్ట్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది, మొదట ఈ మూవీ లో చిత్ర బృందం కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకుంది, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి కాజల్ అగర్వాల్ తప్పుకోవడంతో ఆ స్థానంలో చిత్ర బృందం సోనాల్ చౌహాన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకుంది. ది గోస్ట్ మూవీ కి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నాడు, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ది ఘోస్ట్ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది, మరి ది ఘోస్ట్ మూవీ కనుక మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నట్లు అయితే సోనాల్ చౌహాన్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కే అవకాశం ఉంది, ఇప్పటికే ది ఘోస్ట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.