యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తాజాగా నటించిన 'RRR' సినిమా మార్చి 25న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్.. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించి అభిమానులను తమ అద్భుతమైన నటనతో మెప్పించారు. సినిమాలో ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ మెగా నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదల తర్వాత కొంతమంది అభిమానులు సినిమా లో ఎన్టీఆర్ ని తక్కువగా చూపించారని రామ్ చరణ్ ని సినిమాకే హైలెట్ చేశారని రాజమౌళి పై ఫైర్ అయ్యారు.
కానీ ఈ విషయం పై రాజమౌళి ముందే క్లారిటీ ఇచ్చారు. సినిమాలో కేవలం పాత్రలు మాత్రమే గుర్తుపెట్టుకుని సినిమా చూడాలని.. హీరోల స్టేటస్ మైండ్లో పెట్టుకుని చూస్తే సినిమాకి కనెక్ట్ కాలేరని చెప్పడం జరిగింది. సినిమాలో ఎన్టీఆర్ స్క్రీన్ టైం తక్కువే అయినప్పటికీ ఉన్న సమయంలో తనకిచ్చిన రోల్ కి ఎన్టీఆర్ పూర్తి న్యాయం చేశాడు. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించారు. ఇక సినిమాలో ఈయన నటన చూసి కచ్చితంగా ఎన్టీఆర్ కి నేషనల్ అవార్డు అని కూడా అంటున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతుంది.
అదేంటంటే ఇటీవల బాలీవుడ్ ఫేమస్ మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమాపై ట్విట్టర్ వేదికగా పొగడ్తల వర్షం కురిపించాడు. అందులో ఎన్టీఆర్ నటన గురించి పొగుడుతూ ట్వీట్ చేసిన ఆయన.. బాలీవుడ్ నుండి ఎన్టీఆర్ కి ఆరు బడా బిగ్ ఆఫర్ రెడీగా ఉన్నాయి అని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన చూసి బాలీవుడ్ లోని అగ్ర నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ డేట్స్ కోసం క్యూ కడుతున్నాయని చెబుతూ ప్రస్తుతం ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఆరు బడా ఆఫర్లు వచ్చాయి అని చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ బాలీవుడ్లో వచ్చిన ఆఫర్స్ గురించి స్పందించక పోవడం గమనార్హం గా మారింది...!!