అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా.. స్టార్ హీరో క్షమాపణలు?

praveen
ఇటీవలె మార్చి 27వ తేదీన లాస్ఏంజిల్స్ వేదికగా ఆస్కార్ అవార్డుల వేడుక ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు అందరూ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. అయితే ఈ ఆస్కార్ వేడుకల సమయంలో సంఘటన చోటు చేసుకుంది.  కమెడియన్ క్రిస్ రాక్  అందరినీ నవ్విస్తూ ఇక ఈ వేడుకను ముందుకు నడిపించాడు. ఇలాంటి సమయంలోనే అందరూ షాక్ కు గురయ్యే ఒక ఘటన చోటుచేసుకుంది అన్న విషయం తెలిసిందే.  హాలీవుడ్ హీరో విల్ స్మిత్ అందరిముందే స్టేజి మీదికి కోపంగా వెళ్లి క్రిస్ రాక్ చెంప పగలగొట్టాడు. దీంతో అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు.



 క్రిస్ రాక్  ఒక అవార్డు అందించడానికి స్టేజి మీదికి వచ్చి ఇక అక్కడే ముందు కూర్చున్నా హీరో విల్ స్మిత్ భార్య జాడ పింకెట్ స్మిత్ గురించి కాస్త చమత్కరించాడు. అయితే తన భార్య పై జోకులు వేయడంతో హీరో విల్ స్మిత్ కి కోపం వచ్చింది. ఇక వెంటనే స్టేజి మీదికి వెళ్లి  క్రిస్ రాక్ చెంప చెల్లు మనిపించాడు విల్ స్మిత్. ఇక ఆ తర్వాత నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ గట్టిగా అరిచాడు. ఇక ఘటన జరిగిన కొద్ది సేపటికే ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నాడు విల్ స్మిత్. అయితే విల్ స్మిత్ అలా చేయడంపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.


 ఇకపోతే హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ ఇక ఇటీవల ఆస్కార్ వేడుకల్లో తాను ప్రవర్తించిన దానిపై సిగ్గుపడుతున్నాను అంటూ చెబుతూ అని చెప్పాడు.  క్రిస్ రాక్ చర్యల వల్ల తాను ఇబ్బంది పడ్డానని ఇక తన భార్య వైద్య పరిస్థితిపై జోక్ వేయడంతో భరించలేక పోయాను అని అందుకే ఆగ్రహంతో అలా స్టేజి మీదికి వెళ్లి కొట్టాను అంటూ వివరణ ఇచ్చాడు విల్ స్మిత్.   హింస అనేది విషపూరితమైనది విధ్వంసకరమైనది. గతరాత్రి అకాడమీ అవార్డులలో  నా ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. క్షమించరానిది. ఇక జోకులు నా ఉద్యోగంలో ఒక భాగం.. కాకపోతే నా భార్య ఆరోగ్య పరిస్థితి గురించి జోక్ భరించలేనిదిగా అనిపించింది. అందుకే ఎమోషనల్గా అలా స్పందించాను. అలా చేసినందుకు సిగ్గుపడుతున్నాను..  క్రిస్ రాక్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పుకుంటున్నాను అంటూ విల్ స్మిత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: