రేపే యశ్ "కెజీఎఫ్ 2" ట్రైలర్... ఆకట్టుకుంటుందా ?
ఆ తర్వాత 2018 లో ప్రశాంత్ నీల్ అనే దర్శకుడు యశ్ తో కలిసి కెజీఎఫ్ అనే ఒక సినిమాను తీశాడు. ఈ సినిమా విడుదల అయ్యే అంత వరకు ఎవ్వరికీ తెలియదు. అయితే సినిమా రిలీజ్ అయిన నాటి నుండి మెల్ల మెల్లగా ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన కెజీఎఫ్ సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచింది. దీనితో ఓవర్ నైట్ లో యశ్ సూపర్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమాలో ప్రతి ఒక్క అంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని అఖండ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న కెజీఎఫ్ 2 కోసం దేశ వ్యాప్తంగా యశ్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్, టీజర్, తూఫాన్ సాంగ్ వీడియో ఇవన్నీ ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచాయి. ఈ సినిమా ఏప్రిల్ రెండవ వారంలో విడుదల కావడానికి సిద్దంగా ఉంది. కాగా ఈ సినిమా నుండి రేపు సాయంత్రం 6. 40 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనుంది చిత్ర బృందం. మాస్ యాక్షన్ మూవీ గా వస్తున్న కెజీఎఫ్ 2 ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అన్నది తెలియాలంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే. అంతకన్నా ముందు రేపు విడుదల అయ్యే ట్రెయిలర్ ఎలా ఉంటుంది? మంచి కట్టింగ్ లతో ప్రశాంత్ నీల్ విడుదల చేసే ట్రెయిలర్ అందరినీ ఆకట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి.