అందాల ముద్దుగుమ్మ తాప్సీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఝుమ్మంది నాదం మూవీ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఝుమ్మంది నాదం మూవీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో తాప్సి నటించిన సినిమాలు ఎక్కువ శాతం పరాజయం పాలు కావడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది, అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో తాప్సి క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.
ఇది ఇలా ఉంటే తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీ లో గ్లామర్ పాత్రలు కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీ లో నటించడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ వస్తోంది, అందులో భాగంగా ఇప్పటికే తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే తాప్సి ప్రస్తుతం కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది, అందులో భాగంగా తాప్సీ ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న స్వరూప్ ఆర్ ఎస్ జే దర్శకత్వం వహిస్తున్నాడు, తాప్సి ఈ మూవీ తో పాటు శభాష్ మిథు సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ టీమిండియా ఉమెన్స్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది, ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా టీజర్ లు కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది, ఇలా వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తాప్సి ప్రేక్షకులను అలరిస్తుంది.