గంగూలీనీ కూడా వదలని పుష్ప ఫీవర్.. వీడియో వైరల్..!!
ఇక పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిదా చేశారు. దీంతో నార్త్ ఆడియన్స్ కూడా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు అల్లు అర్జున్. సోషల్ మీడియా లో పుష్ప కు సంబంధించి కొన్ని వీడియోలో తెగ వైరల్ గా మారుతూనే ఉంటాయి. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీలు, క్రీడా సెలబ్రిటీలు సైతం పుష్ప సినిమా పాటలను, డైలాగ్స్ ప్రత్యేక పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు.. సౌరప్ గంగూలీ కూడా పుష్ప సినిమాలోని పాటకు స్టెప్పులు వేయడం జరిగింది దీనితో అందరిని ఆకట్టుకున్నాడు. జి బంగ్లా ఛానల్ లో ప్రసారం అవుతున్న ఒక రియాలిటీ షోలో గంగూలీ. శ్రీవల్లి పాటకు డాన్స్ వేయడం జరిగింది.
అంతటితో ఆగకుండా పుష్ప సిగ్నేచర్ తో తగ్గేదేలా అంటూ అభిమానులకు జోష్ పెంచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇక గత ఏడాది డిసెంబర్లో ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో పుష్ప-2 పై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని మరింత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్లు గా సమాచారం.