బాయ్ కాట్ ఆర్ ఆర్ ఆర్ హ్యాష్ ట్యాగ్ తో హోరెత్తి పోతున్న కన్నడ మీడియా !

Seetha Sailaja
జూనియర్ ఎన్టీఆర్ చరణ్ లకు కర్ణాటకలో లక్షల్స్ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ కు కర్ణాటకలో కూడ భారీస్థాయిలో కలక్షన్స్ వస్తాయని అంతా భావిస్తున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఈసినిమాను చూడద్దు అంటూ కన్నడ సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.


కన్నడ ప్రజలకు రాజ్ కుమార్ అంటే విపరీతమైన అభిమానం. ఆయన కుటుంబ సభ్యులను కూడ విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని నెలల క్రితం చనిపోయిన పునీత్ రాజ్ కుమార్ అంటే కన్నడ రాష్ట్రంలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే పునీత్ చనిపోయినప్పుడు కన్నడ రాష్ట్రంలోని యూత్ అంతా ఆమరణ వార్తను తట్టుకోలేక ఇప్పటికీ షాక్ లోనే ఉన్నారు.


పునీత్ నటించిన ఆఖరి సినిమా ‘జేమ్స్’ గతవారం విడుదలై కన్నడనాట కలక్షన్స్ విషయంలో పెను తుఫాను సృష్టించింది. ఇప్పటికీ ఆమూవీ కలక్షన్స్ బాగానే ఉన్నాయి. అయితే కన్నడ రాష్ట్రంలో డిస్ట్రిబ్యూటర్స్ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ‘జేమ్స్’ మూవీ ధియేటర్లను తగ్గించుకుని ఆ ధియేటర్లు అన్నీ ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఇచ్చేసారు. ఇప్పుడు ఈవిషయమే పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు తీవ్రమైన కోపం వచ్చింది. ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం తమ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘జేమ్స్’ సినిమాను తీసివేయడం ఏమిటి అంటూ పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ‘ఆర్ ఆర్ ఆర్’ పై విరుచుకుపడుతున్నారు.


అంతేకాదు ‘జేమ్స్’ మూవీ కలక్షన్స్ బాగున్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం ‘జేమ్స్’ ఎందుకు కు రాజీ పడాలి అంటూ కోపగించిన వారు అంతా బాయ్ కాట్ ‘ఆర్ ఆర్ ఆర్’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ పునీత్ రాజ్ కుమార్ లు చాలామంచి స్నేహితులు పునీత్ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు పునీత్ శవం చూసి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే అలాంటి జూనియర్ పై ఇప్పుడు పునీత్ అభిమానులు తిరుగుబాటు చేయడం హాట్ న్యూస్ గా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: