బాహుబలి సినిమాతో ప్రపంచం మెచ్చిన దర్శకుడిగా భారీ గుర్తింపును సొంతం చేసుకున్నారు ఎస్.ఎస్.రాజమౌళి. మళ్లీ ఇప్పుడు బాహుబలిని మించి మరోసారి అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన 'త్రిబుల్ ఆర్' సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా విడుదల కాకముందే రాజమౌళి ఓ భారీ అప్డేట్ లీక్ చేసి సినీ అభిమానుల్లో మరింత జోష్ నింపుతున్నాడు. త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
#SSMB29 గా రాబోతున్న ఈ ప్రాజెక్టు లో మహేష్ బాబు లీడ్ రోల్ లో నటిస్తుండగా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చెప్పుకొచ్చాడు రాజమౌళి. మా దగ్గర బేసిక్ స్టోరీ ఉంది. ఈ స్టోరీని పూర్తి స్థాయి కథగా డెవలప్ చేయాల్సి ఉందని చెప్పాడు. అంతేకాదు ఈ సినిమా బాహుబలి,ఆర్ ఆర్ ఆర్ ల కంటే భారీ స్థాయిలో ఉండబోతోందని పరోక్షంగా హింట్ ఇచ్చాడు జక్కన్న. ఇక ఈ సినిమాలో నరసింహ నందమూరి బాలకృష్ణ కూడా నటించబోతున్నాడు అన్న వార్తలపై స్పందిస్తూ.. మహేష్ బాబు ఒక్కరే మెయిన్ లీడ్ యాక్టర్ అని క్లారిటీ ఇచ్చాడు. ఆర్ ఆర్ ఆర్ పూర్తయిన తర్వాత రాజమౌళి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్ తో సినీ లవర్స్ ను మెస్మరైజ్ చేసేందుకు జక్కన్న రెడీ అవుతుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఇక మహేష్ బాబు తో రాజమౌళి తెరకెక్కించబోయే చిత్రం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కంప్లీట్ అడ్వెంచర్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ ప్రాజెక్టు తెరకెక్కబోతున్న ట్లు తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ విడుదలైన తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో బిజీ కానున్నాడు రాజమౌళి. ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా బాహుబలి,ఆర్ ఆర్ ఆర్ సినిమాలను మించి మహేష్ సినిమా ఉంటుంది అని రాజమౌళి చెప్పడంతో ఫాన్స్ అయితే వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...!!