ఆర్ ఆర్ ఆర్ సూపర్ హిట్టే.. కండిషన్స్ అప్ప్లయ్..!!

P.Nishanth Kumar
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చి 25 వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఇంతటి స్థాయిలో అంచనాలను ఏర్పరుచుకోవడం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణం అని చెప్పాలి. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా ఈ సినిమా సూపర్ హిట్ తప్పకుండా అవుతుంది అని కొంతమంది ముందే గెస్ చేస్తున్నారు.

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా తప్పకుండా దేశం గర్వించదగ్గ సినిమా అవుతుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేశారని వారు చెపుతున్న మాటలను బట్టి తెలుస్తుంది. మూడేళ్లుగా వీరిద్దరి దగ్గర్నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడంతో ఈ సినిమా పై ఇంతటి స్థాయిలో అంచనాలను ఏర్పడడానికి మరొక ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా నటిస్తూ ఉండడం వల్ల బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి ఓ భారీ చిత్రం విడుదల ఉంది అంటే దానికి పోటీగా ఏ సినిమా కూడా విడదల ఉండేలా చేసుకోరు మేకర్స్. ఆ విధంగానే అందరితో చర్చలు జరిపి తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కంటే ముందు విడుదలైన ఓ చిత్రం మీద భారీ వసూళ్లు సాధిస్తున్న క్రమంలో ఈ చిత్రంపై ఆ సినిమా యొక్క ప్రభావం ఏమైనా పడుతుందా అన్న అనుమానాలు ఇప్పుడు కలుగజేస్తున్నాయి. బాలీవుడ్ లో చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన కాశ్మీర్ ఫైల్స్ చిత్రం సూపర్ హిట్ అయి రికార్డులు రికార్డులు సృష్టిస్తుంది మరి ఆర్ ఆర్ ఆర్ సినిమా కు ఏ మాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా కూడా కాశ్మీర్ ఫైల్స్ సినిమా పుంజుకుంటుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: