ఇదెక్కడి విచిత్రం.. అది ఆపుకుని.. ఆస్పత్రి పాలైన హీరోయిన్?

praveen
ఇటీవలి కాలంలో ఎంతో మంది గ్యాస్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఉరుకులు పరుగుల జీవితంలో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం.. ఇక జీవన శైలిలో కూడా పూర్తిగా మార్పులు రావడంతో ఇక ఇలా గ్యాస్ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఇక ఇలా గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారు ఎప్పుడూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా పదిమందిలో ఉన్నప్పుడు మరింత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కాళ్ళ మధ్య ఉన్నప్పుడు అపానవాయువు (పిత్తు) ఆపుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల  ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తూ ఉంటారు.

 కానీ జనాల మధ్య ఇక అపానవాయువు వదిలితే పరువు పోతుందని భావించి ఇక అలాగే కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇలా కంట్రోల్ చేసుకుని కొంతమంది ఏకంగా ఆస్పత్రి పాలు అయిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే కేవలం సామాన్య ప్రజలకే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తోంది. ఇటీవలే ఒక సింగర్ అపానవాయువు (పిత్తు) ఆపుకొని చివరికి ఆసుపత్రి పాలైంది. ఇక ఈ విషయానికి సంబంధించిన వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి.


 బ్రెజిల్ సింగర్  పోకాకి ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళింది. అయితే ఆమె గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంది. ఈ క్రమంలోనే ప్రియుడు ఏమనుకుంటాడో అని భావించి బయటికి పంపాల్సిన గ్యాస్ కాస్త బలవంతంగా ఆపుకుంది. కాసేపటి వరకు కంట్రోల్ చేసుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో విలవిలలాడి పోయింది. దీంతో వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చేరింది. ఆ సింగర్ ఇటీవల ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఈ అమ్మడు. గ్యాస్ వచ్చినప్పుడు ఎవరు ఆపుకోకూడదని.. వెంటనే వదిలేయాలని లేదంటే ఆస్పత్రి పాలు అవుతారు అంటూ ఒక ఉచిత సలహా కూడా అందరికీ ఇచ్చేస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Gas

సంబంధిత వార్తలు: