అతన్ని ముద్దు పెట్టుకున్నా.. భర్తకు నిజం చెప్పేసిన నటి?
ఇటీవలే మార్చి 20వ తేదీన ప్రసారమైన జడ్జిమెంట్ డే ఎపిసోడ్ లో మరో కంటెస్టెంట్ తన రహస్యాన్ని బయటపెట్టిందిm మునవ్వర్ ఫారుఖి, నిషా రావల్ ను తమ జీవితంలోని రహస్యాలను బయట పెట్టే అవకాశాన్ని ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే నిషా రావాల్ మొదటగా బజార్ నొక్కింది. ఇప్పుడు వరకు ఎవరికీ తెలియని సీక్రెట్ ను పంచుకోవాలి అంటూ కోరింది హోస్ట్ గా కంగానా. ఈ క్రమంలోనే ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. నేను కరణ్ మెహెరాను 2012లో పెళ్లి చేసుకున్నా.. 2014లో నాకు గర్భస్రావం అయింది. ఇది అందరికి తెలిసిన విషయం. అయితే అప్పుడు నేను ఐదు నెలల గర్భవతినీ. అయిన శారీరకంగా మానసికంగా వేధించే బంధం లో ఉన్నా అని అందరికీ తెలుసు.
తర్వాత ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యా.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు నన్ను చాలా మంది చాలా మాటలు అన్నారు. పబ్లిక్ ఫిగర్ కావడంవల్ల ఎవరితో ఎలాంటివి షేర్ చేసుకోలేకపోయా. ఇక 2015 లో సంగీత్ వేడుకలో నా పాత స్నేహితుడిని కలిసా.. అక్కడ చాలామంది నన్ను అవమానించిన సమయంలో ఎవరైనా నాకు మద్దతుగా ఉంటే బాగుండు అనిపించింది. అక్కడి నా పాత మిత్రుడు చాలా కాలం కలిసిన తర్వాత వెంటనే అతను సపోర్ట్ చేశాడు. దీంతో అతనికి ఆకర్షితురాలిని అయ్యాను. నేను అప్పుడు నేను అతని ముద్దు పెట్టుకున్నాను. ఈ విషయం భర్తకు కూడా చెప్పాను అయితే అప్పటికే మేము విడిపోవడం గురించి చర్చించుకున్నాం.. చివరికి నా కోసం నేను స్టాండ్ తీసుకున్నాను అంటూ షాకింగ్ నిజాలు బయటపెట్టింది నిషా రావాల్.