ప్రస్తుతం
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా నయా కాంబినేషన్స్ లో సినిమాలు తెరకెక్కడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతిరత్నాలు
డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో సీనియర్
హీరో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నాడు అన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంది.
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం
అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న
ఎఫ్3 సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ
సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అంతే వేగంతో ప్రమోషన్స్ కూడా జరుగుతున్నట్లు సమాచారం.
అన్ని పనులను ముగించుకుని మే 27న ఈ
సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో
విక్టరీ వెంకటేష్ మరికొన్ని సరి కొత్త ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నట్లు తెలుస్తోంది. అందులో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జాతిరత్నాలు దర్శకుడు కె.వి అనుదీప్ దర్శకత్వంలో
విక్టరీ వెంకటేష్ ఓ
సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని
సినిమా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దర్శకుడు అనుదీప్
వెంకటేష్ కి ఓ స్టోరీ వినిపించగా.మ్ అది నచ్చి
వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న ట్లు ఫిలింనగర్ టాక్.
ఫ్యామిలీ అండ్
కామెడీ ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకున్న
వెంకీ ఈ సినిమాతో మరింత పాపులర్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇక ప్రస్తుతం అనుదీప్
తమిళ హీరో శివ కార్తికేయన్ తో ఓ
సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో ఈ
సినిమా రూపొందుతోంది. ఈ
సినిమా ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉన్నట్లు సమాచారం. ఈ
సినిమా పూర్తి కాగానే
వెంకటేష్ తో
మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది...!!