'నాన్న గారి ఆ సినిమాని రీమేక్ చేయాలని ఉంది': ఎన్టీఆర్

Anilkumar
టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం 'త్రిబుల్ ఆర్'. సుమారు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడగా.. ఎన్నో వాయిదాల తర్వాత ఈ మార్చి 25 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.ఇక ఈ సినిమాని సుమారు ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ రేంజ్ లో నిర్వహిస్తోంది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఎన్టీఆర్ రామ్, చరణ్ లను సంగీత దర్శకుడు కీరవాణి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు.


 ఈ ఇంటర్వ్యూలో హీరోలు ఇద్దరిని కొన్ని ప్రశ్నలు అడిగారు. కీరవాణి ఎన్టీఆర్ ను మీ నాన్నగారి సినిమాల్లో ఏ సినిమా అయినా రీమేక్ చేయాలంటే ఏ సినిమాని రీమేక్ చేస్తావ్ అని అడగగా.. అందుకు జూనియర్ ఎన్టీఆర్ సమాధానమిస్తూ..' నాన్న గారు నటించిన సినిమాల్లో మీరు సీతయ్య సినిమాకి మంచి సంగీతం అందించారు. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. కుదిరితే సీతయ్య సినిమాను రీమేక్ చేయడానికి నేను ఇష్టపడతాను. ఆ సినిమాలో ఇంటెన్సిటీ, హీరో క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా ఉంటాయి' అని అన్నాడు తారక్. ఇక ఇదే విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ..


' సీతయ్య సినిమాను ఇప్పుడున్న పరిస్థితులకి రాసి కాస్త మోడ్రన్ టచ్ ఇస్తే  కచ్చితంగా అది ఎన్టీఆర్ కి బాగా వర్కౌట్
 అవుతుంది' అని అన్నాడు రామ్ చరణ్. దీంతో ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ఫ్యాన్స్ సైతం ఎన్టీఆర్ తండ్రి నటించిన సీతయ్య సినిమాను రీమేక్ చేస్తే కచ్చితంగా ఆ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అందుకుంటుందని సోషల్ మీడియా వేదికగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఎన్టీఆర్ సిపిఎస్ సినిమాను రీమేక్ చేస్తారేమో చూడాలి...!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: