అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, హెబ్బా పటేల్ , రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ మూవీ లో తన అందచందాలతో మాత్రమే కాకుండా నటనతో కూడా హెబ్బా పటేల్ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది, ఇలా కుమారి 21 ఎఫ్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్న హెబ్బా పటేల్ కు ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమా అవకాశాలను దక్కించుకుంది. కుమారి 21ఎఫ్ మూవీ తర్వాత హెబ్బా పటేల్ నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు ఈ ముద్దుగుమ్మకు నిరాశనే మిగిల్చాయి, అలాంటి సమయం లోనే హెబ్బా పటేల్ , రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన రెడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇలా ఉంటే ఆ మధ్య రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఒరేయ్ బుజ్జి గా సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఒక చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హెబ్బా పటేల్ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే హెబ్బా పటేల్ సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులతో టచ్ లో ఉంటూ అనేక విషయాలను తెలియజేస్తూ ఉంటుంది, హెబ్బా పటేల్ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది.వ ఈ సందర్భంగా హెబ్బా పటేల్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది, ఈ నేపథ్యం లో మీ వయస్సు ఎంత అని అడిగిన ఓ అభిమాని ప్రశ్నకు బదులిచ్చిన హెబ్బా పటేల్... నాలోని జ్ఞానానికి సరిపోయే వయసుకు చేరుకున్నానని తన అసలు వయస్సు ఎంతో చెప్పకుండా హెబ్బా పటేల్ మాట దాటేసింది.