టాలీవుడ్ హీరో గోపీచంద్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, గోపీచంద్ హీరోగా తన కెరియర్ ను మొదలు పెట్టినప్పటికీ, ఆ తర్వాత విలన్ పాత్రలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. విలన్ పాత్రల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న గోపీచంద్ 'యజ్ఞం' సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు, యజ్ఞం సినిమా తర్వాత గోపీచంద్ నటించిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గోపీచంద్ క్రేజీ హీరోగా మారిపోయాడు.
ఇది ఇలా ఉంటే కొంత కాలంగా వరస పరాజయాలతో డీలా పడిపోయిన గోపీచంద్ 'సిటీమర్' సినిమా విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ , మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో గోపీచంద్ సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది, ఇది ఇలా ఉంటే గోపీచంద్ , శ్రీ వాస్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం , లౌక్యం వంటి రెండు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు గోపీచంద్ కు శ్రీ వాస్ కు మంచి గుర్తింపు ను తీసుకువచ్చాయి, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కుతుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఈ నెల మూడవ తేదీ ప్రారంభమైన విషయం తెలిసిందే, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిత్ర బృందం కొంత విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది, విరామం తర్వాత ఈ మూవీ తాజా షెడ్యూల్ ను ఈ నెల 21 నుంచి హైదరాబాదు లో ప్రారంభించబోతున్నారు.