పాన్ ఇండియా సినిమాగా 'పుష్ప'కి దక్కిన ప్రశంసల గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. కోవిడ్ పాండమిక్ సమయంలో ఇండియన్ సినిమా స్క్రీన్ మీద 'పుష్ప ది రైజ్' ప్రభంజనం అయితే చూశాం.
అల్లు అర్జున్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అయిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా ఈ 'పుష్ప' తెరకెక్కిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా సినిమాల గురించి ప్రస్తావన వస్తే, ఖచ్చితంగా అందులో 'పుష్ప' ప్రస్తావన కూడా వచ్చి తీరాల్సిందేనని తెలుస్తుంది.. అయితే, 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్లలో ఎక్కడా 'పుష్ప' ప్రస్తావన అయితే రావడంలేదు. పైగా, రాజమౌళి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా కూడా రాబోతోందట.. అన్న ప్రచారం జరుగుతున్న సమయంలో కూడా, రాజమౌళి వద్ద ఈ ప్రశ్నని తెలుగు మీడియాగానీ, ఇతర భాషలకు చెందిన మీడియాగానీ అస్సలు ప్రస్తావించకపోవడం అల్లు అర్జున్ అభిమానుల్ని తీవ్రంగా కలచివేస్తోంది.
రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై కూడా ప్రస్తావించాడు. ఆయన్ను పలు అంశాలపై మీడియా ప్రతినిథులూ ప్రశ్నించారు. మహేష్ – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలో నందమూరి బాలకృష్ణ ఓ కీ రోల్ చేయబోతున్నారట నిజమేనా . అన్న అంశమూ ప్రస్తావనకు వచ్చింది. అయితే, మహేష్ సినిమాలో ఇంకెవరూ కూడా వుండరు.. అందులో ఆయనొక్కడే హీరో.. అని రాజమౌళి స్పష్టత అయితే ఇచ్చేశాడు.
అదే సమయంలో, అల్లు అర్జున్‌తో సినిమా ఎప్పుడు అని ప్రశ్నించిన తెలుగు మీడియా, కన్నడ మీడియా.. రెండూ లైట్ తీసుకోవడం విశేషం. అల్లు అర్జున్‌ని కావాలనే మీడియా పక్కన పెట్టిందా.? అన్న చర్చ కూడా తెరపైకొస్తోందిప్పుడు. ఈ విషయమై అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ రగిలిపోతున్నారు.మరి చూడాలి అల్లు అర్జున్ ఫాన్స్ వారి కోపాన్ని ఏ విధంగా చూపిస్తారో చూడాలి మరి