RRR ఈవెంట్ లో మెరిసిన పెళ్లి సందడి హీరోయిన్ ..!

Divya
డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ఏమిటంటే..RRR ఈ సినిమా ఈ నెల 25న భారీ అంచనాల మధ్య విడుదల అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో ఈవెంట్ లను వరుసగా దేశంలో పలు ప్రాంతాలలో జరుపుతున్నారు. దీంతో ఇప్పటివరకు ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. ప్రతి ఈవెంట్ లో కూడా హీరోలు ఇద్దరూ మరియు రాజమౌళి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలబడ్డారని చెప్పవచ్చు. కానీ ఈరోజు జరిగిన కర్ణాటక చిక్ బల్లాపూర్ లోని ఈవెంట్ లో మాత్రం హీరోయిన్ శ్రీలీలా సందడి చేయడం జరిగింది.

అనూహ్యంగా  ఈమె ఈ ఈవెంట్ లో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఎన్టీఆర్ మాట్లాడేటప్పుడు చప్పట్లు కొట్టడంతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి కొంతమంది శ్రీలీలాకు.. ఈ చిత్రానికి ఏమైనా సంబంధం ఉందా.. ఆమె ఏమైనా నటించిందా అనే అనుమానాలు కూడా కొంతమంది తెలియజేస్తున్నారు. అయితే సినిమాలో మాత్రం ఆమె నటించినట్లుగా ఇప్పటి వరకు చిత్ర బృందం ఏవిధంగా ప్రకటించలేదు.


అలాగే చిత్ర బృందంతో కూడా ఈమెకు ఏ విధమైనటువంటి కాంటాక్ట్ లేదు.. అయితే ప్రస్తుతం కర్ణాటక మీడియా వర్గాలు తెలియజేస్తున్న ప్రకారం ఏ ఒక్క హీరోయిన్ లేకుండా ఉంటే వెలితిగా ఉన్నట్లుగా కనిపిస్తోంది అందుకే ఈమెను కన్నడ డిస్ట్రిబ్యూటర్ ఈవెంట్ కు తీసుకు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడికి రావడం అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. కేవలం ఈమె స్టేజిపైకి ఎక్కకుండానే జనాలతో ఈ ఈవెంట్ ని చూస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తోంది.


ఈమె నటించిన పెళ్లి సందడి చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ కూడా కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని అందుకుంది. కానీ అవకాశాలు మాత్రం అనుకోని విధంగా ఈమె తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం రవితేజ సరసన ఒక సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: