ఆర్య చిత్రం వెనుక ఇంత పెద్ద స్టోరీ జరిగిందా..?

Divya
అల్లు అర్జున్ నటించిన మొట్టమొదటి కమర్షియల్ చిత్రం ఆర్య. ఇందులో అల్లుఅర్జున్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. గంగోత్రి సినిమా తో ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ కూడా ఆర్య సినిమాతోనే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.. ఈ చిత్రాన్ని నిర్మాత గా దిల్ రాజు, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చినది. సరికొత్త విభిన్నమైన ప్రేమ కథ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు అల్లు అర్జున్. ఇక అందుచేతనే అప్పట్నుంచి సుకుమార్ , అల్లు అర్జున్ కు మంచి స్నేహ బంధం ఉన్నది.

కానీ అలాంటి అంచనాల మధ్య ఆర్య-2  చిత్రం భారీ డిజాస్టర్ ను చవిచూసింది. అయితే తాజాగా ఆర్య సినిమా వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు గా సమాచారం. మొదటగా ఈ సినిమా కథ హీరో రవితేజకు చెప్పగా ఆయన కథ విన్న తర్వాత తనకి వర్కవుట్ కాదని తెలియజేశాడు. అలాంటి సమయంలో రవితేజ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని చేయలేను అని తెలియజేశారట.
ఇక ఆ తర్వాత ఈ సినిమా స్టోరీ ని ప్రభాస్ కి వినిపించగా.. ఇప్పటికిప్పుడే ఇలాంటి స్టోరీ తో సినిమా చేయాలేను అని ప్రభాస్ చెప్పేశాడట. దీంతో ఈ సినిమాను అల్లుఅర్జున్ వద్దకు తీసుకెళ్లగా అల్లు అరవింద్ కూడా ఈ సినిమా స్టోరీ నచ్చడంతో. అవకాశం ఇచ్చారు. అలా ఆర్య చిత్రం విడుదలై మంచి సక్సెస్ ను అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని రవితేజ ,ప్రభాస్ ఎవరో ఒకరు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో.. ఈ చిత్రం ఎవరికి ఎలా బాగుంటుంది అనేది ఎవరూ చెప్పలేము. అయితే ఈ చిత్రాన్ని ఈ స్టార్ హీరోలు నో చెప్పడంతో అల్లు అర్జున్ హీరోగా ఎదగడానికి ఏ సినిమా సహాయ పడిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: