ఎన్టీఆర్ 30 : హమ్మయ్య : మొత్తానికి లాంఛింగ్ కి ... ముహూర్తం కుదిరిందా ... ??

GVK Writings
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్. మరొక నటుడు రామ్ చరణ్ తో కలిసి తొలిసారిగా ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించగా డివివి దానయ్య దీనిని నిర్మించారు. ఈ మూవీ ఈనెల 25న వరల్డ్ వైడ్ గా ఎంతో భారీ ఎత్తున విడుదల కానుంది. దీని తరువాత కొరటాల శివ తో తన కెరీర్ 30వ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనుండగా బాలీవుడ్ నటి అలియా భట్ ఇందులో కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ మూవీకి కోలీవుడ్ యువ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్లుగా అలానే అన్ని వర్గాల ఆడియన్స్ అని ఆకట్టుకునేలా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా స్టోరీని ఎంతో అద్భుతంగా రాసుకున్నట్లు సమాచారం. రాజకీయ అంశాలతో పాటు ఆకట్టుకునే మెసేజ్ తో దర్శకుడు కొరటాల ఈ సినిమాని తెరకెక్కించనున్నారని, మూవీలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండనుందని టాక్. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ దీని ప్రారంభం గురించి మాత్రం కొన్నాళ్ల నుండి చర్చలు జరుగుతూ ఉన్నాయి.

అసలు ఈ సినిమా పక్కాగా ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం తమకు అర్ధం కావడం లేదని, త్వరలోనే మూవీ ని లాంచ్ చేయాలని మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన అధికారికంగా లాంచ్ కాబోతోందని, పలువురు టాలీవుడ్ ప్రముఖులు దీనికి గెస్ట్ లుగా హాజరు కానున్నారని అంటున్నారు. మరి ఇదే కనుక వాస్తవం అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇక పండుగే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: