అబ్బా : చూస్తుంటే బాబాయ్ మాదిరిగా ... పెద్ద హిట్టే కొట్టేలా ఉన్నాడే ... ??

GVK Writings
యువ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి ఎఫ్ 3 తో పాటు గని అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ కూడా చేస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తుండగా సిద్దు ముద్ద, అల్లు బాబీ ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న గని మూవీ ఏప్రిల్ 8 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తుండగా సీనియర్ నటి నదియా ఆయనకి తల్లిగా కనిపించనున్నారు. కన్నడ నటుడు ఉపేంద్ర, విలక్షణ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా యాక్షన్ తో పాటు కమర్షియల్ గా కూడా తెరక్కినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి థమన్ అందించిన సాంగ్స్, నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచాయి.

గనిలో హీరోగా నటించిన వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాని, అలానే యావత్ యూనిట్ మొత్తం కూడా మధ్యలో కరోనాని సైతం లెక్కచేయకుండా హార్డ్ వర్క్ చేసిన గని మూవీ తప్పకుండా రిలీజ్ తరువాత భారీ సక్సెస్ కొట్టడం ఖాయం అని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విషయం ఏమిటంటే, గతంలో వరుణ్ బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో బాక్సర్ గా కనిపించి దానితో మంచి సక్సెస్ కొట్టారు. అదే విధంగా ప్రస్తుతం అబ్బాయి వరుణ్ కూడా అదే బాక్సర్ రోల్ చేస్తూ ఉండడంతో చూడబోతే తప్పకుండా బాబాయి మాదిరిగా అబ్బాయి కూడా గని తో గట్టి హిట్టే కొట్టేలా కనపడుతున్నది అంటున్నారు సినీ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: