జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈయనకి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మన అందరికీ తెలిసిందే.ఇకపోతే సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం సక్సెస్ లే కాదు అని..ఫ్లాప్ సినిమాలు పడ్డా..అయితే వాటిని తట్టుకుని..ఇక ఆ సినిమాల ద్వార ఎంతో నేర్చుకుని..క్రుంగిపోకుండా..మనం బాల్ ని ఎంత స్పీడ్ గా కొడితే అంతే స్పీడ్ గా రీబౌన్స్ అయ్యిన్నట్లు.. ఫ్లాప్ సినిమా పడిన ప్రతిసారి ఆ మరుసటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా నటించి అని అభిమానుల చేత శభాష్ అని అనిపించుకున్నాడు ఎన్టీఆర్.ఇదిలా ఉంటె ప్రస్తుతం తారక్ రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా లో నటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న ఎన్టీఆర్ ..తాజాగా జరిగిన డైనమిక్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఇంటర్వ్యుల్లో సరదాగా నవ్వుతూ..నవ్విస్తూ..సినిమా గురించి బోలెడు విషయాలను అభిమానులతో పంచుకోవడం జరిగింది.అయితే ఇందులో భాగంగా అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. రాజమౌళి తో సినిమా షూటింగ్ ఎలా ఉంటుంది అనే సంగతులు గురించి చెప్పండి అంటూ అడిగారు..ఇక దీనికి ఎన్టీఆర్ రిప్లై ఇస్తూ..ఇంట్రెస్టింగ్ విషయాలను లీక్ చేశారు. ఇకపోతే ఎన్టీఆర్ మాట్లాడుతూ..'అప్పటికే మమ్మల్ని మా ఎనర్జీనీ బాగా పిండేసి ఉంటాడు..అలిసిపోయి ఉన్నా కూడా రాజమౌళి వదిలేవారు కాదు.
అంతేకాదు మేము రాజమౌళి చేతిలో నలిగిపోతూ ఆ బాధను..కొన్ని సంధర్భాలల్లో ఆయన భార్య రమతో చెప్పుకునేవాళ్లం.కాగా ఆమె కూడా ఆయనకు పిచ్చి బాగా పెరిగిపోయింది రా నాన్నా..నువ్వు పో త్వరగా వెళ్ళి ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రా..నా బంగారు నువ్వు వెల్లు రా బండ.. ఆ పిచ్చోడి దగ్గరకు పో' అంటూ చెప్పుకొచ్చేదని ఎన్టీఆర్ తో చెప్పిన మాటలని అభిమానులకు తెలియజేశాడు ఎన్టీఆర్. అయితే దీని బట్టి రమ గారితో ఎన్టీఆర్ కు మంచి స్నేహ బంధం ఉంది అని తెలుస్తుంది. అయితే ఎంతలా అంటే తారక్ ని బండ అని ముద్దుగా పిలుచుకునేలా అన్న మాట...!!