డార్లింగ్ "ప్రభాస్" ఉదారత... అభిమాని కుటుంబానికి ఆర్ధిక సాయం?

VAMSI
ప్రభాస్ చేసిన పని తన దయా హృదయాన్ని అందరికీ తెలిసేలా చేసింది. ఈ హీరో అందించిన సాయం మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆసరాగా మారింది. వివరాల్లోకి వెళితే తాజాగా మార్చ్ 11 న ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అయ్యి మిశ్రమ స్పందనను తెచ్చుకుంటుంది. అయితే ఆశించిన స్థాయిలో రికార్డు నమోదు చేయలేక పోయినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం బాగానే రాబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నూతనంగా సినిమా విడుదల కావడంతో పలు చోట్ల థియేటర్ల వద్ద భారీ బ్యానర్లను కడతారు అన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు లోని  ఐమాక్స్ ప్రముఖ థియేటర్ వద్ద కూడా ఒక బ్యానర్ కట్టేందుకు చల్ల కోటేశ్వరరావు అనే అభిమాని ఈ మూవీ బ్యానర్ కట్టేందుకు ప్రయత్నిస్తూ ఉండగా  అతడు ప్రమాదవశాత్తు మరణించారు. అయితే అతని మరణం గురించి ఆ చెవిన ఈ చెవిన పడి చివరకు హీరో ప్రభాస్ వరకు వెళ్లింది. విషయం గురించి తెలుసుకున్న ప్రభాస్ వెంటనే ప్రమాదంలో మరణించిన కోటేశ్వర రావ్ భార్య పిచ్చమ్మ  బ్యాంక్ ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమ చేశారు. ఆ  కుటుంబానికి కొంతైనా ఆర్ధిక సాయం అందించి అండగా నిలబడాలని ముందుకొచ్చారు.

అంతేకాదు నేరుగా ఆ కుటుంబానికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు ప్రభాస్ పరామర్శించి దైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. నిరుపేద కుటుంబ అయిన చల్ల కోటేశ్వరరావు కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా నిలబడతానని వారికి దైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన రెబల్ స్టార్ అభిమానులు, ప్రేక్షక అభిమానులు, అందరూ కూడా ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్ మరోసారి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: