హృతిక్ రోషన్... క్రిష్-4 మూవీ అప్డేట్స్..!!
చివరిగా క్రిష్ -3 సినిమా వచ్చి దాదాపుగా ఎన్నో సంవత్సరాలు అవుతున్నది.. ఈ సిరీస్ లో నాలుగవ సినిమాను కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్న ట్లుగా చిత్రబృందం ప్రకటించడం జరిగింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది.. ఇక గత చిత్రాలకు దర్శకత్వం వహించిన రాకేష్ రోషన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే క్రిష్-4 సినిమా గురించి మాట్లాడుతూ డైరెక్టర్ ఏ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది అని తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించి స్టోరీలైన్ కూడా సిద్ధం చేశాము సినిమా ప్రొడక్షన్ వర్క్ కూడా చేయడానికి సిద్ధమయ్యారు అని తె*యజేశారు.
అయితే బాలీవుడ్ మీడియా వర్గాల ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది జూన్ లో మొదలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంబంధించి మేకింగ్ విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ వేద అనే రీమేక్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది.