ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఉంది అంటే అందరూ
సాయి పల్లవి అనే చెబుతారు.ఈమె
ఫిదా మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి... ఆ తరువాత ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి చక్కని హావభావాలతో కుర్రకారు గుండెల్ని పిండేస్తోంది. ఇకపోతే స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా నటించకపోయినా కూడా.. ఎవరికీ దక్కనంత క్రేజ్ ను సొంతం చేసుకుంది.ఇక ఈమె గ్లామర్ డోస్ కు దూరంగా ఉంటూ.. కేవలం నటనా పరమైన పాత్రలకే తన ఓటు అంటోంది. అయితే ఈ తేడానే మిగతా హీరోయిన్ల కంటే ఆమెను స్పెషల్ గా చూసేలా చేస్తుంది.
తాజాగా ఇప్పుడు ఎవరూ చేయని చాలా విభిన్నమైన పాత్రలో ఆమె కనిపించబోతోంది. ఇకపోతే ఒకప్పుడు ఇలాంటి పాత్రలు
విజయశాంతి ఆ తర్వాత రోజు మాత్రమే చేసి చూపించారు.ఇకపోతే
ఒసేయ్ రాములమ్మ మూవీలో
విజయశాంతి నక్సలైట్ గా కనిపించి మెప్పించింది. అయితే అప్పటి నుంచి అందరూ ఆమెను రాములమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. ఆమె తర్వాత
కృష్ణ హీరోగా తెరకెక్కిన ఎన్కౌంటర్ మూవీలో
రోజా నక్సలైట్ గా మెరిసింది. అయితే అందులో ఆమె చేసిన స్వర్ణక్క పాత్ర బాగా పేరు తెచ్చుకోవడంతో.. ఆ తర్వాత స్వర్ణక్క అనే టైటిల్ తో
సినిమా కూడా చేసింది.
ఇక ఇప్పటి తరం హీరోయిన్లలో ఎవరూ చేయని నక్సలైట్ పాత్రను చేయడానికి
సాయి పల్లవి రెడీ అయింది.అయితే విరాటపర్వం మూవీలో
రానా తో కలిసి
సాయి పల్లవి నటించింది. కాగా ఇందులో సీనియర్
హీరోయిన్ ప్రియమని కూడా నక్సలైట్ పాత్రలో మెరిసింది. అయితే సున్నితమైన భావోద్వేగాల సన్నివేశాలతో కూడిన ఈ మూవీని
వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ
సినిమా మనసును కలచివేసే కథతో తెరకెక్కింది అని తెలుస్తోంది.ఇకపోతే ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడిన ఈ
మూవీ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.అయితే ఇప్పటి తరం హీరోయిన్లలో అలాంటి పాత్రకు ఒప్పుకున్న
సాయి పల్లవి ఒక రికార్డు క్రియేట్ చేసింది అనే చెప్పుకోవాలి...!!