మొదటిసారి అలాంటి పాత్రలో సమంత.. ఫ్యాన్స్ లో ఆతృత?

praveen
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంతా కెరియర్ పూర్తిగా పాడైపోతుంది అని అందరూ అనుకున్నారు. విడాకుల బాధలో సమంత చిత్ర పరిశ్రమకు దూరం అవుతుంది అని భావించారు. కానీ విడాకుల బాధ మనసులో దాచుకుని పైకి నవ్వుతూ ఇక తన కెరీర్ ను మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తుంది సమంత. అంతకుమించి అనే రేంజ్ లోనే సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక కాస్త సమయం దొరికిందంటే చాలు విహార యాత్రలకు వెళుతూ మనసులో ఉన్న బాధ పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇక సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ అన్నింటిపై కూడా గట్టిగా కౌంటర్ ఇస్తుంది సమంత.


 అయితే సమంత ఇప్పటివరకు ఎన్నో గ్లామర్ పాత్రలు ఎన్నో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించింది. కానీ ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో మాత్రం విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. సమంత కెరియర్లో ఫ్యామిలీ మెన్ లో ఉన్న పాత్ర మొదటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని చెప్పాలి. కేవలం నటనతోనే కాదు యాక్షన్ సన్నివేశాల్లో కూడా అందరిని మెస్మరైజ్ చేసింది సమంత. ఇక ఇప్పుడు మరి కొన్ని వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది అని తెలుస్తోంది.


 బాలీవుడ్ హీరో వరుణ్ధావన్ నటించబోతున్న వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్ గా సెలెక్ట్ అయిందట. అమెరికాకు చెందిన పాపులర్ వెబ్ సిరీస్ ను ఇండియన్ వర్షన్ లో తెరకెక్కించబోతున్నారట.  ఇక ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్ సన్నివేశాలు భారీగానే ఉండబోతున్నాయి అని తెలుస్తోంది. దీంతో ఇక ఈ పాత్ర కోసం సమంత ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటుందట. దీనికోసమే గత కొంత కాలం నుంచి కసరత్తులపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ లో సమంత మగరాయుడులా ఉండే ఒక పాత్రలో కనిపించబోతున్నారట.దీంతో ఈ పాత్ర ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: