బ్రేక్ ఈవెన్ కి అన్ని కోట్ల దూరంలో ఉన్న భీమ్లా నాయక్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్, ఈ మూవీ ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 25 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.   ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని బాగానే కలెక్షన్ లను కూడా రాబట్టింది,  మొదటి మూడు రోజుల్లోనే  భీమ్లా నాయక్ మూవీ 100 కోట్లకు  పైగా కలెక్షన్ లను సాధించింది. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించగా,  దగ్గుబాటి రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.


ఇది ఇలా ఉంటే 14 రోజుల వరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్షన్  లను సాధించిందో చూద్దాం... రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో ‘భీమ్లా నాయక్'  మూవీ బాగానే రాణించింది, భీమ్లా నాయక్ మూవీ నైజాం లో రూ. 34.62 కోట్లు, సీడెడ్‌ లో రూ. 11 కోట్లు, ఉత్తరాంధ్ర లో రూ. 7.53 కోట్లు, ఈస్ట్‌ లో రూ. 5.44 కోట్లు, వెస్ట్‌ లో రూ. 4.95 కోట్లు, గుంటూరు లో రూ. 5.19 కోట్లు, కృష్ణా లో రూ. 3.76 కోట్లు, నెల్లూరు లో రూ. 2.53 కోట్ల తో కలిపి రూ. 75.02 కోట్లు షేర్, రూ. 114.60 కోట్లు గ్రాస్‌ దక్కింది. రెండు వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా మిగిలిన ప్రాంతాల్లోనూ కూడా బాగానే రాణించింది, భీమ్లా నాయక్ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా లో రూ. 8.21 కోట్లు, ఓవర్సీస్‌ లో రూ. 12.47 కోట్లు కలెక్ట్ చేసింది, దీంతో మొత్తం గా భీమ్లా నాయక్ సినిమా 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 95.70 కోట్లు షేర్‌ తో పాటు రూ. 155.75 కోట్ల గ్రాస్ వచ్చింది. భీమ్లా నాయక్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం, ఇప్పటి వరకు భీమ్లా నాయక్  మూవీ రెండు వారాల్లో రూ. 95.70 కోట్ల కలెక్షన్ లను సాధించింది, అంటే మరో రూ. 12.30 కోట్లు వసూలు చేస్తే భీమ్లా నాయక్ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: