సూపర్ స్టార్ కుమార్తె.. మరొక స్టార్ హీరో మూవీలో..!!

Divya
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ప్రతి ఒక్కరికి తెలుసు.. గత కొద్దిరోజుల కిందటే ధనుష్ తో విడాకులు తీసుకోబోతున్నట్లు గా ప్రకటించారు. విడాకుల తర్వాత వీరిద్దరిపై ఎన్నో పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. అయితే ప్రస్తుతం ఐశ్వర్య కరోనా తో ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ చేరినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరు విడిపోవడానికి అసలు విషయం ఏమిటంటే ఏ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ ఇద్దరు కూడా చాలా బిజీగా వారి పనులలో ఇ ముడుకు పోయారు.


ఇక ఐశ్వర్య విషయానికి వస్తే ఈ మధ్య ఒక సినిమా షూటింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఐశ్వర్య సినిమా షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది ఐశ్వర్య. ఇక ఈమె దర్శకత్వంలో ప్రస్తుతం ఒక సినిమా రూపొందించబోతున్న ట్లుగా గతంలో కూడా వార్తలు వినిపించాయి అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అది కూడా తమిళ హీరో అయినటువంటి శింబుతో ఒక సినిమా నిర్మించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఇక తమిళ మీడియా వర్గాల నుంచి వినిపిస్తున్న మాట ఏమిటంటే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న సినిమాగా వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లోనూ సినీ వర్గాల వారు చాలా ఆసక్తి చూపుతున్నారు. గతంలో శింబు మరియు ఐశ్వర్య రజినీకాంత్ గురించి మీడియాలో ఎన్నోరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అది కూడా ఐశ్వర్య డైరెక్షన్లో శింబు హీరోగా నటిస్తున్నాడు అని తమిళ మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. చివరిగా హీరో శింబు మానాడు ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అందుచేతనే ఐశ్వర్య కూడా ఈ హీరోకి మరొక మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: