కొరియోగ్రాఫర్స్ న్యూ టాలెంట్..!

NAGARJUNA NAKKA
సినిమాలకు భాషబేధం, సరిహద్దులు అన్నీ తొలిగిపోయాయి. మన సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. అలాగే సినిమా క్రాఫ్ట్స్‌లోనూ బౌండరీస్‌ చెరిగిపోతున్నాయి. సాధారణంగా కొరియోగ్రాఫర్లు అనే వారు డ్యాన్సులు కంపోజ్‌ చేయాలి. స్టంట్ మాస్టర్స్‌ అయితే ఫైట్లు చేయించాలి అనే ఒపీనియన్స్‌ ఇప్పటి వరకు ఉన్నాయి. కానీ అవి మారిపోతున్నాయి. ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్లు మెగాఫోన్‌ పడుతున్నారు. బ్లాక్‌బస్టర్స్‌ అందుకుంటున్నారు.

రాజు సుందరం కొరియోగ్రాఫర్‌గా బోల్డన్ని అవార్డులు అందుకున్నాడు. 'జనతాగ్యారేజ్, మహర్షి' సినిమాలకి నేషనల్‌ అవార్డులు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు మెగాఫోన్‌తోనూ మేజిక్‌ చేయాలనుకుంటున్నాడు రాజు సుందరం. తర్వాత శర్వానంద్‌ హీరోగా రాజు సుందరం ఒక సినిమాని డైరెక్ట్‌ చేసే అవకాశముందని సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. యువి క్రియేషన్స్‌లో ఈ సినిమా నిర్మాణమయ్యే అవకాశం ఉందట. ఇక రాజు సుందరం ఇంతకుముందు తమిళ్ లో అజిత్‌ హీరోగా 'ఐగన్' అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.  

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మేల్‌ కొరియోగ్రాఫర్స్‌కి టఫ్‌ కాంపిటీషన్‌ ఇచ్చి, నేషనల్‌ అవార్డ్‌ కూడా అందుకున్న ఫీమేల్‌ కొరియోగ్రాఫర్స్‌ చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. వాళ్లల్లో అందరికంటే ముందుండే కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్. దశాబ్ధాలుగా కొరియోగ్రాఫర్‌గా వర్క్‌ చేస్తోన్న బృందా మాస్టర్‌ రీసెంట్‌గానే 'హే సినామికా' అనే సినిమాకు దర్శకత్వం వహించింది. దుల్కర్ సల్మాన్, కాజల్‌ అగర్వాల్, అదితి రావ్‌ హైదరీ లీడ్‌ రోల్స్‌ ప్లే చేసిన ఈ సినిమా మల్టీలింగ్వల్‌లో విడుదల అయింది.

కొరియోగ్రాఫర్స్‌ నుంచి డైరెక్టర్స్‌గా మారినవాళ్లు చాలామంది ఉన్నారు. బాలీవుడ్‌ని కొన్నేళ్ల పాటు రూల్‌ చేసిన  ఫరాఖాన్ డైరెక్టర్‌గానూ బ్లాక్‌బస్టర్స్ తీసింది. 'మై హూనా, ఓం శాంతి ఓం' లాంటి హిట్స్‌ తీసింది. అలాగే ఇండియన్ మైఖెల్ జాక్సన్‌ ప్రభుదేవా తెలుగు, తమిళ్, హిందీల్లో డైరెక్టర్‌గా సూపర్ హిట్ అయ్యాడు. 'నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, వాంటెడ్, దబాంగ్3, రాధే' లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు ప్రభుదేవా. 'కాంచన' సీరీస్‌తో బాలీవుడ్‌ వరకు వెళ్లాడు లారెన్స్. ఇప్పుడు వీళ్ల రూట్‌లోనే మరికొంతమంది కొరియోగ్రాఫర్స్‌ కూడా దర్శకులుగా మారుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: