షాక్: హృతిక్ రోషన్ ఇంట మళ్లీ పెళ్లి బాజాలట..!!
అంతేకాకుండా ఇప్పటికే ఇరు కుటుంబాలు కూడా వీరి వివాహానికి అనుమతి ఇచ్చినట్లుగా సమాచారం. హృతిక్ రోషన్ కూడా స్వయంగా తన ప్రియురాలిని తన కుటుంబానికి పరిచయం చేసినట్లుగా తెలుస్తోంది.. హృతిక్ కూడా సబా ఆజాద్ కుటుంబ సభ్యులకు కూడా నచ్చడంతో వీరి వివాహానికి అంగీకరించినట్లుగా మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్ కి ఇది రెండో వివాహం .. గతంలో కూడా సుస్సాన్ ఖాన్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలుసు.. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు. ఇక వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక పిల్లల కోసం వీరిద్దరు కొద్దిరోజులు స్నేహితులుగా కలుసుకున్నారు.
సబా ఆజాద్ -హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సాన్ ఖాన్ ల మధ్య మంచి స్నేహ బంధం ఉన్నది. ఇక సుస్సాన్ ఖాన్ కు పాటలు అంటే ఎంతో ఇష్టం. సబా ఆజాద్ రాసిన పాటలన్నీ తనకి పంపించేదట. ఇక అప్పుడప్పుడు సుస్సాన్ ఖాన్ కూడా ఆమెకు కొన్ని టిప్స్ చెబుతూ ఉండేదట. ఇక అలాంటి సమయంలోనే హృతిక్ రోషన్ - సుసాన్ ఖాన్ , సబా ఆజాద్ స్నేహితులుగా ఉంటామని తెలియజేశారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా వార్ చిత్రం లో నటించారు.. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఫైటర్ సినిమా లో ఇప్పుడు నటించడానికి సిద్ధంగా ఉన్నారు.