అదిరిపోయే ప్రశ్న వేసిన నెటిజెన్ దెబ్బకు షాక్ తిన్న శ్రీముఖి..!!

murali krishna
తెలుగు యాంకర్స్‌లో శ్రీముఖికి ఉన్న క్రేజ్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది ఈ బొద్దుగుమ్మ..

శ్రీముఖి ప్రధాన పాత్రలో వచ్చిన క్రేజీ అంకుల్స్ అనే సినిమా ఆ మధ్య విడుదలైంది. ఈ సినిమాకు దర్శకుడు ఇ. సత్తిబాబు పనిచేసాడు . ఈ సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి కూడా నటించారు. ఈ సినిమాను గుడ్‌ సినిమా గ్రూప్‌ మరియు శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

బుల్లితెర మరియు వెండితెరపై రచ్చ చేస్తున్న శ్రీముఖి .. బుల్లితెరపై రాములమ్మగా ఫుల్ ఫేమస్ అయింది. పటాస్ మరియు బిగ్ బాస్ షోలతో శ్రీముఖి దుమ్ములేపేసింది. ఇటీవల బొమ్మ అదిరింది, కామెడీ స్టార్స్ వంటి షోలకు కూడా హోస్ట్‌గా చేసింది. మధ్యలోనే తప్పుకుంది. అయితే శ్రీముఖి మాత్రం ఇప్పుడు సినిమాలు మరియు కొత్త షోలతో బిజీగా మారింది.

జాతిరత్నాలు అంటూ రాబోతోన్న స్టాండప్ కామెడీ షోకు శ్రీముఖి యాంకర్‌గా మారనుందట.. ఇక చిరంజీవి భోళా శంకర్ సినిమాతో ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతుంది.మొత్తానికి శ్రీముఖి మాత్రం ఫుల్ జోరు మీదుందని తెలుస్తుంది. గత ఏడాది శ్రీముఖి హీరోయిన్‌గానూ ట్రై చేసింది. క్రేజీ అంకుల్స్ అంటూ అడల్ట్ కామెడీ సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమా దారుణమైన ఫలితాన్ని ఆమె చవిచూసింది.

శ్రీముఖి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ కూడా అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. చాలా రోజుల తరువాత ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ కూడా పెట్టేసింది. ఇక ఒక్కో నెటిజన్ ఒక్కో ప్రశ్నను అడగడం మొదలు పెట్టారు.

అందులో ఓ నెటిజన్ అయితే తన పొడవాటి జుట్టు గురించి అడిగేశాడట.. మీరు షార్ట్ హెయిర్ ట్రే చేశారా? గత దశాబ్ద కాలంగా అదే హెయిర్ స్టైల్ చూసి చూసి బోర్ కొడుతోంది అని ఓ నెటిజన్ అడిగేశాడట.. దీనికి శ్రీముఖి ఇలా సమాధానం ఇచ్చింది. అవును మీరు చెప్పినదానికి నేను అంగీకరిస్తాను.. కానీ ఇప్పుడు నేను చేస్తోన్న షోలు మరియు సినిమాల ప్రకారం షార్ట్ హెయిర్ అస్సలు ఒప్పుకోరు అని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: